Thursday, September 2, 2010

రాష్టవ్య్రాప్తంగా వైఎస్‌కు ఘన నివాళి
హైదరాబాద్‌ : దివంగత సిఎం, ప్రియతమ నేత డా. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రథమ వర్థంతి సందర్భంగా ప్రజలు, కాంగ్రెస్‌ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఘన నివాళులర్పించారు. రాష్టవ్య్రాప్తంగా వైఎస్‌ వర్థంతి కార్యక్రమాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్‌ కార్యకర్తలు నివాళులర్పించారు. అసెంబ్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్‌ చిత్రపటానికి మంత్రులు నివాళులర్పించారు. మహానేత ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రభుత్వం ఉన్నంతవరకూ కొనసాగిస్తుందని మంత్రులు సబితాఇంద్రారెడ్డి, దానం నాగేందర్‌లు తెలిపారు.

వైఎస్‌తో ఉన్న ఆత్మీయత గొప్పది : రోశయ్య

హైదరాబాద్‌ : ఆత్మీయుడు వైఎస్‌ఆర్‌ వర్థంతికి వెళ్లాలని ఉన్నా ఆరోగ్యం సహకరించకపోవడంతో వెళ్లలేకపోయినందుకు ఎంతో బాధగా ఉందని సిఎం రోశయ్య అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధం, ఆత్మీయతను రోశయ్య నెమరు వేసుకున్నారు. వైఎస్‌ స్మృతి నిత్యనూతనమని, ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు జనంలో ఎప్పుడూ పచ్చగానే ఉంటాయని సిఎం అన్నారు. అలాంటి మహానేత ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిన్నట్లు ఆయన చెప్పారు. వైఎస్‌ ప్రతమ వర్థంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు రోశయ్య తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.


ఇడుపులపాయలో వైఎస్‌కు కుటుంబ సభ్యుల నివాళి

కడప : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ ప్రథమ వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన సమాధివద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. సతీమణి వైఎస్‌ విజయమ్మ, తనయుడు జగన్‌, కూతురు, కోడలు, ఇతర కుటుంబ సభ్యులు వైఎస్‌కు నివాళులర్పించారు.

జనసంద్రంగా మారిన ఇడుపుల పాయ

కడప : జిల్లాలోని ఇడుపుల పాయ జనసంద్రంగా మారింది. దివంగత సిఎం వైఎస్‌ఆర్‌ ప్రతమ వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్‌ ఘాట్‌ను సందర్శించేందుకు ఆయన అభిమానులు తండోపతండాలుగా తరలి వచ్చారు. జనహృదయ నేతకు జనం నివాళులర్పించారు. అపరభగీరథుని ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని వేడుకున్నారు. దాదాపు లక్ష మంది వరకు వైఎస్‌ అబిమానులు, కార్యకర్తలు ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాటన్‌ను సందర్శించినట్లు సమాచారం.

వైఎస్ కుటుంబసభ్యులు విజయమ్మ, జగన్, వివేకానందరెడ్డి తదితరులు సమాధివద్ద పుష్పగుచ్ఛములుంచి నివాళులర్పించారు. వైఎస్ సన్నిహితుడు కేవీపీ దంపతులు మహానేతకు నివాళి అర్పించారు.

వైఎస్ సమాధి పక్కన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహానికి ఇరు వైపుల రెండు స్థూపాలను ఏర్పాటు చేశారు. వాటిపై బైబిల్ సూక్తులను పొందుపరిచారు. 

No comments:

Post a Comment